Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెలుగుమట్లలో నిర్మాణాల కూల్చివేతలపై స్టేకు నిరాకరణ

వెలుగుమట్లలో నిర్మాణాల కూల్చివేతలపై స్టేకు నిరాకరణ

- Advertisement -

భూదాన్‌ భూముల్లో నిర్మాణాల కేసులో హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్‌ భూముల్లో నిర్మించిన ఇండ్ల కూల్చివేతల వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్న నేపథ్యంలో స్టే వంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెప్పింది. టి. వెంకటనరసమ్మ సహా పాతిక మంది బాధితులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ బి. విజయ్ సేన్‌రెడ్డి గురువారం విచారించారు. నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా అన్యాయంగా కూల్చివేత చర్యలు తీసుకున్నారని పిటిషనర్‌ లాయర్‌ చెప్పారు.

పిటిషనర్లలో ఆరుగురికి ఇప్పటికే పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని ప్రభుత్వం చెప్పింది. సొంత ఇండ్లు ఉన్నందున ఐదుగురి దరఖాస్తులను తిరస్కరించినట్టు చెప్పింది. ఇతరుల విషయాల పరిశీలన ఉందని తెలిపింది. కూల్చివేతలకు గురైన నిర్మాణాల్లో పిటిషనర్ల ఇండ్లు లేవని వివిరించింది. కూల్చివేతల అనంతరం 311 మందికి పట్టాలు, 101 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపింది. వాదనల తర్వాత స్టే ఇవ్వడాన్ని నిరాకరించిన హైకోర్టు విచారణను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -