- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పరకాల మండలం అలియాబాద్ ప్రభుత్వ పాఠశాలకు ఆ గ్రామంలోని గ్రానైట్ క్వారీ (స్టోనెక్స్) యజమాని సిహెచ్ వెంకటేశ్వరరావు తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఎంఇఓ సంపతి రమాదేవి ఆద్వర్యంలో పాఠశాలకు కావాల్సిన వాటర్ ప్యూరీపయర్, మైక్ సెట్ తో పాటు విద్యార్థులకు నోట్ బుక్స్, సూస్, టైం, బెల్ట్, బ్యాడ్జెస్ తదితరాలు పాఠశాల హెడ్ మాస్టర్ ఎండి ఆజాంకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు మానస, ప్రసన్న క్వారీ మెనేజర్ వెంకటక్రిష్ణ, వీరభద్రం స్వామి గ్రామస్తులు సనత్, శ్రీను, రాజేందర్, రాజయ్య అంగన్వాడి టీచర్స్, ఆయాలు, వంట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -