Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరాధారమైన ఆరోపణలు మానుకో: మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక..

నిరాధారమైన ఆరోపణలు మానుకో: మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : షిండే.. నీవు చేసిన అభివృద్ధి ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మీకాంతరావు చేపడుతున్న అభివృద్ధిపై చర్చకురా.. లేదంటే నిరాధారమైన ఆరోపణలు మానుకో.. అంటూ కాంగ్రెస్ నాయకులు గురువారం మద్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హెచ్చరించారు. జుక్కల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అభివృద్ధిని ఓర్వలేక, నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నీవు చేసిన అభివృద్ధి ఏమిటి.. ప్రస్తుతం తోట లక్ష్మి కాంతారావు ఒకటిన్నర సంవత్సరంలోనే చేసిన అభివృద్ధి ఏంటో చర్చకు వస్తావా.. రా అంటూ మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే కు సవాలు విసిరారు.

అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుపై నిరాధారమైన ఆరోపణలు మానుకోకపోతే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. జుక్కల్ నియోజకవర్గం విద్య అభివృద్ధిలో హబ్బుగా మార్చడానికి ఎమ్మెల్యే తోటా కృషి ఫలితమే మద్నూర్ మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కృషి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యేపై, జుక్కల్ యువతను రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, సలాబత్పూర్ హనుమాన్ మందిర్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వట్నాల రమేష్, కొండ గంగాధర్, కర్రే వార్ రాములు, మండలానికి చెందిన వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -