Monday, December 8, 2025
E-PAPER
Homeక్రైమ్కుక్క స్వైర విహారం..

కుక్క స్వైర విహారం..

- Advertisement -

ఏకంగా 30కి పైగా మందిపై దాడి

-కుక్క కాటుకు గురైన వారితో నిండుకున్న ప్రభుత్వ ఆస్పత్రి

నవతెలంగాణ-ఆమనగల్

ఆమనగల్ పట్టణంలో ఆదివారం సాయంత్రం కుక్క బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై దాడికి పాల్పడి ఏకంగా 30 కి పైగా మందిని గాయపరిచింది. పట్టణంలోని శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై వెంకటేశ్వర టాకీస్ నుంచి అయ్యప్ప స్వామి కొండ వరకు దారి పొడవునా ఎవ్వరూ కనిపిస్తే వారిపై దాడి చేసి గాయపరిచింది.

దీంతో కుక్క కాటుకు గురైన వారి రోదనలతో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో భీకర వాతావరణం నెలకొంది. వైద్య సిబ్బంది గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స అందించారు. కొంత మంది యువకులు ధైర్యం చేసి కుక్కను మట్టుపెట్టారు. మున్సిపల్, సంబందిత అధికారులు వెంటనే స్పందించి పట్టణంలో వేలాదిగా ఉన్న కుక్కలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -