Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుల దురహంకార హత్యపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుల దురహంకార హత్యపై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కుల దురహంకార హత్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుమురంభీం – అసీఫాబాద్‌ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్య దుర్మార్గమని తెలిపారు. ఎస్టీ (కోయ) కులానికి చెందిన తలండి శ్రావణ రాణి, అదే గ్రామంలో వెనుకబడిన కులానికి చెందిన శివార్ల శేఖర్‌ ఇద్దరూ తల్లిదండ్రులను ఎదిరించి ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. శేఖర్‌ తండ్రి సత్తయ్య ఈ వివాహాన్ని జీర్ణించుకోలేక, రాణిని గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా హత్య చేశాడని తెలిపారు.

రాణి నిండు గర్భిణిగా వున్నప్పటికీ ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజాన్ని కలచి వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాపితంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించటం లేదనీ, వీటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమౌతున్నదని ఆరోపించారు. కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి హత్యలు జరుగకుండా ప్రభుత్వం ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -