Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీహార్‌ ముఖ్యమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బీహార్‌ ముఖ్యమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఐద్వా హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ డిమాండ్‌
మహిళా డాక్టర్‌ హిజాబ్‌ను తొలగించడంపై ఆగ్రహం


నవతెలంగాణ – ముషీరాబాద్‌
ముస్లిం మహిళా డాక్టర్‌ హిజాబ్‌ను తొలగించి అవమానించిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై కఠిన చర్యలు చేపట్టాలని, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఐద్వా హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏ. పద్మ, వై.వరలక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ చౌరాస్తాలో ఐద్వా సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బేటీ బచావో బేటీ పడావో అని చెప్తున్న బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో బాధిత ముస్లిం డాక్టర్‌కు అండగా నిలవాల్సిన మంత్రుల వ్యాఖ్యానాలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. బీజేపీ క్యాబినెట్‌ మంత్రులు సంజయ్ నిషాద్‌, గిరిరాజ్‌ వ్యాఖ్యలు వారి మహిళా వ్యతిరేక ఫ్యూడల్‌ భావజాలాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లావణ్య, రజియా, రామానుజమ్మ, పావని, పద్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -