Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చైనా మాంజా వాడితే కఠిన చర్యలు: ఆలేరు ఎస్సై వినయ్

చైనా మాంజా వాడితే కఠిన చర్యలు: ఆలేరు ఎస్సై వినయ్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగరేసే ఉత్సాహంలో ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని ఆలేరు ఎస్‌.ఐ.వినయ్ ఆదేశించారు. శనివారం నవతెలంగాణ తో ఆయన మాట్లాడుతూ నిషేధిత చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన దారం చైనా మాంజా గాలిపటాలకు తగిలితే గొంతుకు కోసుకుపోయే ప్రమాదం ఉందని, గాల్లో ఎగురుతూ ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు తీవ్ర గాయాలు కలిగే అవకాశం ఉందన్నారు.

పక్షులు, మూగజీవులు కూడా ఈ మాంజా వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. గాలిపటాలు అమ్మే వర్తకులు చైనా మాంజా తయారీ, విక్రయం వినియోగం నేరమని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ విషయాన్ని వివరించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాబోయే సంక్రాంతి పండుగను ఆనంద ఉత్సవాల నడుమ జరుపుకోవాలని కోరుకుంటూ ఆలేరు మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు రాజకీయ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -