Monday, September 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకఠిన చర్యలు తప్పవు..

కఠిన చర్యలు తప్పవు..

- Advertisement -

అఫ్ఘనిస్తాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు
న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అఫ్ఘనిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఇటీవల ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాన్ని తిరిగి ఇవ్వకపోతే అఫ్ఘాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో ఆయన పోస్టు పెట్టారు. అఫ్ఘానిస్తాన్‌ లోని బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌ను నిర్మించిన వారికి అంటే.. అమెరికాకు తిరిగి ఇచ్చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే.. తాను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌ స్వాధీనం చేసుకునే అంశంపై అఫ్ఘాన్‌తో చర్చలు జరుపుతామన్నారు. దాన్ని తిరిగి తీసుకుంటామని వారు అలా చేయకపోతే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు.

ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా దళాలను అక్కడికి పంపుతారా అని ఈ సందర్భంగా ఓ విలేకరి ప్రశ్నించగా.. బదులిచ్చేందుకు ట్రంప్‌ నిరాకరించారు. చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బగ్రామ్‌ ఎయిర్‌ బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు ఇది అతి దగ్గరగా ఉంటుందని, కేవలం గంట వ్యవధిలో వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ నిర్ణయంపై బీజింగ్‌ స్పందిస్తూ.. అఫ్ఘాన్‌ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ పేర్కొన్నారు. యూఎస్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అఫ్ఘాన్‌ అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -