Thursday, February 12, 2026
E-PAPER
Homeకరీంనగర్జీవిత బీమా సంస్థలో సమ్మె

జీవిత బీమా సంస్థలో సమ్మె

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో భాగంగా సమ్మె చేశారు. సమ్మె ఐసీఈయు  యూనియన్ శాఖ అధ్యక్షులు  ఎన్ దినకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్ఐసి లో 3వ తరగతి ఉద్యోగుల నియామకం వెంటనే చేపట్టాలని , పాత పెన్షన్ అందరికి వర్తింపచేయాలని ,పెట్టుబడుల ఉపసంహరణ విరమించుకోవాలని ,100% విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని వ్యతిరేకించడం జరిగిందన్నారు.

కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగిందనీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాన్ని పూర్తీగా విరమించుకోవాలని ,ప్రభుత్వరంగల సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.సమ్మెలో ఇన్సూరెన్స్ ఉద్యోగులతో పాటు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు . సమ్మెలోశ్రీకాంత్ ,పర్వతి మల్లేశం ,శివాని ,గాజుల శ్రీనివాస్ ,బాలగంగాధర్ , ఆయిల్ల శ్రీనివాస్ ,నర్సింహారెడ్డి , కిరణ్,శరత్, భూమయ్య బద్దిరాజు,స్రవంతి ,కావ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -