Saturday, September 20, 2025
E-PAPER
Homeబీజినెస్ఫైనాన్సీయల్‌ డిస్ట్రిక్‌లో అద్దెలకు భలే డిమాండ్‌

ఫైనాన్సీయల్‌ డిస్ట్రిక్‌లో అద్దెలకు భలే డిమాండ్‌

- Advertisement -

గతేడాది 26 శాతం పెరుగుదల
వచ్చే ఏడాదిలో ఎఎస్‌బిఎల్‌ లాఫ్ట్‌ ప్రాజెక్టు పూర్తి
ఆ సంస్థ ఫౌండర్‌, సీఈఓ అజితేష్‌ కొరుపోలు వెల్లడి


నవతెలంగాణ – హైదరాబాద్‌
నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారుతోన్న ఫైనాన్సీయల్‌ డిస్ట్రిక్‌లో నివాసాలకు, అద్దెలకు భారీగా డిమాండ్‌ పెరుగుతోందని ప్రీమియం రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఎఎస్‌బిఎల్‌ వ్యవస్థాపకులు, సీఈఓ అజితేష్‌ కొరుపోలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజితేష్‌ మాట్లాడుతూ.. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో ఫైనాన్సీయల్‌ డిస్ట్రిక్‌లో 3 గదుల నివాసాల అద్దెలు ఏకంగా 25.7 శాతంగా పెరిగాయన్నారు. పెట్టుబడులపై రాబడి 4-6 శాతానికి చేరుకుందని.. ఇది హైదరాబాద్‌లోని సగటు రాబడి 2-3 కంటె రెట్టింపు అని తెలిపారు. ఈ ప్రాంతంలో తమ సంస్థ నిర్మిస్తోన్న ఎఎస్‌బిఎల్‌ లాఫ్ట్‌ ప్రాజెక్టుకు విశేష స్పందన లభిస్తోందన్నారు. 5 ఎకరాల్లో జి ఫ్లస్‌ 45 ఫోర్లలో 856 నివాసాలతో అందుబాటులోకి తెస్తోన్న ఈ ప్రాజెక్టును 2025 డిసెంబర్‌ కల్లా పూర్తి చేసి వినియోగదారులకు అందించనున్నామని చెప్పారు. 1700-1900 చదరపు అడుగుల విస్తీర్ణలో ప్లాట్లను నిర్మిస్తున్నామని చెప్పారు. చదరపు అడుగు ధరను రూ.11000గా నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్టు స్థలానికి రూ.250 కోట్లు, అభివృద్ధికి మరో రూ.250 కోట్లను వెచ్చిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో వచ్చే రెండు, మూడేళ్లలో ఇక్కడ 90వేల నుంచి లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దాదాపు 26వేల మంది ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి గూగుల్‌కు చెందిన 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ రానుందన్నారు. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఆపిల్‌, టీసీఎస్‌ తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -