Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంబీసీ రిజర్వేషన్ల సాధనకై హస్తినలో సమరం

బీసీ రిజర్వేషన్ల సాధనకై హస్తినలో సమరం

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నేడు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా
ఢిల్లీ చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీసీల రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని హస్తినకు చేరింది. ‘జితనీ ఆబాదీ.. ఇతనీ హిస్సేదారి (ఎంత జనాభా ఉంటే.. అంతే వాటా)’ అనే రాహుల్‌ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కేంద్రంతో సమరాన్ని సన్నద్ధ మైంది. ఇందులో భాగంగా బుధవారం సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో జంతర్‌మంతర్‌లో ‘కాంగ్రెస్‌ పోరుబాట’ ధర్నా చేపట్టనుంది. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవెర్చే బాధ్యతను సీఎం రేవంత్‌ రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు.
ధర్నాకు రాహుల్‌ గాంధీ
బీసీ రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో జరిగే పోరుకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఘీభావం తెలపనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -