Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీ వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటాలే శరణ్యం : పాలడుగు భాస్కర్‌

అంగన్‌వాడీ వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటాలే శరణ్యం : పాలడుగు భాస్కర్‌

- Advertisement -

సీఐటీయూలో చేరిన 200మంది అంగన్వాడీ కార్యకర్తలు
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌

అంగన్‌వాడీ వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటాలే శరణ్యం అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. ఆదివారం సీఐటీయూ కుత్బుల్లాపూర్‌ మండల అధ్యక్షులు కీలుకాని లక్ష్మణ్‌ అధ్యక్షతన కుత్బుల్లాపూర్‌ ప్రాజెక్టు 8 సెక్టార్ల నుంచి టీఎన్జీవో సంఘం నుంచి 200 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాలడుగు భాస్కర్‌ సమక్షంలో సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టి, కార్మికుల పొట్టను కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 29 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా చేసి కార్మికులకు హక్కులు లేకుండా చేస్తుందన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పీఎం శ్రీవిద్య, నూతన విద్యా విధానం పేరుతో అంగన్‌వాడీ సెంటర్లను మూసి వేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా అంగన్‌వాడీ సెక్టర్లలో పని చేసే వారందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి బెదిరింపులు, నిర్బంధాలకు గురి చేసినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనంత రం కుత్బుల్లాపూర్‌ ప్రాజెక్టు 8 సెక్టార్ల కన్వీనర్‌గా శ్యామల, కమిటీ సభ్యులు గా అనసూయ, మతీన్‌, శ్యామల, అర్చన, గీత, మమత, అనంతలక్ష్మీ, లక్ష్మి, అరుంధతి, హర్ష, సురేఖ, రమణ, పరమేశ్వరి, సునీత, లలితను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎర్ర అశోక్‌, మండల నాయకులు అంజయ్య, స్వాతి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -