– పాఠశాల స్థాయి స్పోర్ట్స్ మీట్, బహుమతుల ప్రధానం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని పీఎంశ్రీ చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫైనాన్సియల్ లీటరసీ (ఆర్ధిక సాధికారత ) అ అంశం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎస్బిఐ మేనేజర్ ఆర్థిక సారధికారతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ అనే అంశంపైన జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఒరియంటల్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ మహేందర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాలుర, బాలికల విభాగంలో స్కూల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆటలు ఆడించారు. ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య చేతులమీదుగా బహుమతులు, స్నాక్స్ అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కే.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాధికారతపై విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



