Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల కులం, ఆదాయం, నివాసం ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి

విద్యార్థుల కులం, ఆదాయం, నివాసం ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి

- Advertisement -

యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు…అక్కల బాపు యాదవ్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
: కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల ఐదు మండలాల్లోని విద్యార్థులకు కులం, నివాసం, ఆదాయం, ధృవీకరణ పత్రాలు సంబధిత తహసీల్దార్ లు ఆమోదించక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్తులకు వెంటనే సర్టిఫికెట్లు అందజేయాలని అన్నారు. భూభారతి సదస్సులు జరుతుండం వల్ల సర్టిఫికెట్స్ ఇవ్వలేక పోయామని తహసీల్దార్ లు చెబుతున్నారని, ఈ నెల 20న భూభారతి సదస్సులు ముగిసినా.. ఇంతవరకు సంబదిత తహసీల్దార్ లు విద్యార్థుల సర్టిఫికెట్స్ పై దృష్టి సారించికపోవడం శోచనీయమన్నారు. ఇటీవల ఎస్సి విద్యార్థులకు ప్రయివేట్ పాఠశాలలో 1, 5 తరగతులకు ఫ్రీ స్కూల్ కు ధరఖాస్తు చేయాల్సి ఉండగా .. సంబదిత తహసీల్దార్ లు సరియైన సమయానికి సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో చాల మంది పిల్లలు ధరఖాస్తు చేయలేదని, ఇందుకు నిదర్శనం తహసీల్దార్ ల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనబడుతుందన్నారు. ఇకనైనా సంబదిత తహసీల్దార్ లు వెంటనే స్పందించి పిల్లల ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని త్వరగా సర్టిఫికెట్స్ జారిచేయాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad