- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సుల్తాన్ పేట్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్ తమకు సౌకర్యాలు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పూలమాలలతో సుల్తాన్ పేట్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా సన్మానించారు. సుల్తాన్ పేట్ పాఠశాలకు వచ్చే మారేపల్లి రోడ్డు బాగు చేయించడం, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తమకు ఎంతో సౌకర్యం కల్పించారంటూ పాఠశాల విద్యార్థులు ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ ను, అలాగే ఉప సర్పంచ్ బాలరాజును, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన సంతోష్ పటేల్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మారుతి, విద్యార్థిని విద్యార్థులు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



