- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో శ్రీనివాస రామానుజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులు గణపతి ఆకారంలో కూర్చొని భారతదేశ ఐక్యతను చాటినట్లు ప్రిన్సిపాల్ శ్రీరాములు తెలిపారు. శనివారం గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం వినాయక ఆకృతిలో ఆకారంలో కూర్చోబెట్టి, సంస్కృతి సంప్రదాయాలతో పాటు విద్యార్థులు ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీశైలం, రాజకుమార్, రజనీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -