Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'ఫీజు' కోసం విద్యార్థుల నిరసన

‘ఫీజు’ కోసం విద్యార్థుల నిరసన

- Advertisement -

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు
అందోల్‌లో భారీ ర్యాలీ, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా


నవతెలంగాణ- విలేకరులు
పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాల్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట పుస్తకాలు చదువుతూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్‌ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.

స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని వికారాబాద్‌, పరిగి పట్టణ కేంద్రంలో పుస్తకాలు చదువుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యార్థుల పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు పెద్దఎత్తున విద్యార్థులు ర్యాలీ తీశారు. అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్‌ మండలంలో పరిధిలో ఎస్‌ఎఫ్‌ఐ గజ్వేల్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -