Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుని కోసం విద్యార్థుల రాస్తారోకో

ఉపాధ్యాయుని కోసం విద్యార్థుల రాస్తారోకో

- Advertisement -

– సంగారెడ్డి జిల్లా నాగర్‌గిద్ద మండలం ముక్టపూర్‌లో ఘటన
నవతెలంగాణ-మనూర్‌

ఉపాధ్యాయుని కోసం విద్యార్థులు రోడ్డుపై బైటాయించి, రాస్తారోకో చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా నాగల్‌ గిద్ద మండలం ముక్టపూర్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌ను ఇటీవల డిప్యూటేషన్‌పై ఇరకపల్లి పాఠశాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఉపాధ్యాయుడు రమేష్‌ బదిలీపై వేరే చోటుకు వెళ్లుతున్నట్టు తెలుసుకున్న విద్యార్థులు.. ఆయన్ను తమ పాఠశాలలోనే ఉంచాలని, ఆయనతో పాఠాలు బోధింపజేయాలని కోరుతూ.. ముక్టపూర్‌ చౌరస్తా రోడ్డుపై విద్యార్ధులు బైటాయించి, రాస్తారోకో నిర్వహించారు. ”మా సారు మాకే కావాలి, ప్రభుత్వం వెంటనే బదిలీ రద్దు చేయాలి” అనే నినాదాలతో గంట సేపు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రమేష్‌ ఇరకపల్లి పాఠశాలకు వెళుతుండగా మార్గమధ్యలో విద్యార్థులు అడ్డుకొని కంటతడి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -