- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని ఆ గ్రామ సర్పంచ్ అమృత్వాలు శ్రీకాంత్ మంగళవారం సందర్శించారు. ఈ క్రమంలో ఆయన పాఠశాలలో, అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వ పరంగా అందించే భోజనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పిల్లలకు అంగన్వాడి పిల్లలకు ప్రభుత్వ నిబంధనాల ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనములో పాల్గొని విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. సర్పంచ్ పాఠశాల, అంగన్వాడి కేంద్రాల సందర్శన పట్ల గ్రామస్థులు అభినందించారు.
- Advertisement -


