Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఒక్కరోజు విధులను నిర్వర్తించి అందర్నీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని,రాబోవు కాలంలో పిల్లలు ఉపాధ్యాయులు చెప్పింది మంచిగా విని చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.

స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రిగా భాషబోయిన శివకుమార్, ముఖ్యమంత్రిగా కటకం హర్షధావన్,ఎమ్మెల్యేగా పుల్లూరు సాత్విక్,జిల్లా కలెక్టర్గా రమణబోయిన సాత్విక,జిల్లా విద్యాధికారిణిగా పులి మైథిలి, మండల విద్యాధికారిణిగా లక్ష్మీ ఐశ్వర్య, ప్రధానోపాధ్యాయురాలుగా సంటి దీక్షిత,తాసిల్దార్ గా గుగులోతు యోగిత,ఎంపీడీవో గా మణికాంత్,మిగతావారు ఉపాధ్యాయులుగా పాత్రలను పోషించారు.

ప్రతిభ కనబరిచిన వారిని మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,బండారు భవాని,అనిల్ కుమార్,మిట్టగడుపుల విక్రం,ఆంజనేయులు,మౌనిక,మంజుల,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -