- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజీపేట మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం (MPDO),పోలీస్ స్టేషన్, మండల విద్యాశాఖ కార్యాలయం (MEO),కోర్టు,మండల రెవెన్యూ కార్యాలయం (MRO) తదితర కార్యాలయాలను సందర్శించి అక్కడి పని విధానాలను తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు.
- Advertisement -



