Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంఅండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ సరఫరాపై అధ్యయనం

అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ సరఫరాపై అధ్యయనం

- Advertisement -

– బెంగళూరులో పనుల పరిశీలన
– ఫ్యూచర్‌సిటీలో ఏర్పాటుకు సన్నద్ధం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీలో అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్ల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యయనం చేస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారంనాడాయన బెంగళూరులోని అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌లైన్ల వ్యవస్థను పరిశీలించారు. కర్ణాటక పవర్‌ ట్రాన్సిమిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, , బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లరు కంపెనీ లిమిటెడ్‌ అధికారులతో కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో పనితీరును పర్యవేక్షించారు. బ్యాంకు రుణాలు, సాంకేతిక సమస్యలు, నష్టాలు, లాభాలు, ప్రమాదాలు తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సంస్థల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఆ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు పంకజ్‌పాండే తదితరులు ఈ సమీక్షను నిర్వహించారు. టీజీట్రాన్స్‌కో సీఎమ్‌డీ కృష్ణభాస్కర్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీ తదితరులు కూడా పాల్గొన్నారు. బెంగళూరులో 2018-19లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 7,400 కిలోమీటర్ల 11 కేవీ ఓవర్‌హెడ్‌ లైన్లను ఏర్పాటు చేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ డక్టులను ప్రాధాన్యత, భవిష్యత్‌లో టెలికం కంపెనీలతో లీజు ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -