Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుతహశీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.!

తహశీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.!

- Advertisement -

భూభారతి రిపోర్టుపై ఆరా..
నవతెలంగాణ – మల్హర్ రావు 
: మండల కేంద్రమైన తాడిచర్లలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం భూ సమస్యల పరిస్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రిపోర్టుపై అరా తీశారు. అనంతరం కార్యాలయ సిబ్బంది సమ యపాలన పాటించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ,విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి మెమోలు జారి చేయాలని ఆదేశించ్చినట్లుగా తెలుస్తోంది.

షబ్ కలెక్టర్ కార్యాలయంలో తనిఖీ సందర్భంగా తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రికార్డ్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్ మాత్రమే విధుల్లో ఉండగా మిగతా సిబ్బంది లేకపోవడంతో ఒక్కసారిగా హాజరు రిజిస్టర్ ను పరిశీలించగా ఆర్ ఐ-1, రికార్డు అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ నలుగురు వీరి సంతకాలు లేకపోవడంతో డ్యూటీ సమయం దాటిపోయిన,విధుల్లోకి రాకపోవడంతో వారికి మెమోలు జారీ చేయాలని తహశీల్దార్ రవికుమార్ ను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad