Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరద బాదితులకు అన్నదానం చేసిన దంపతులను అభినందించిన సబ్ కలెక్టర్

వరద బాదితులకు అన్నదానం చేసిన దంపతులను అభినందించిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఉపాధ్యాయ దంపతులు వాగ్మారే జ్యోతి శివశంకర్ కుమార్తె జన్మదిన సందర్భంగా వరద బాధితులకు అన్నదానం చేసిన మద్నూర్ వాసులకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అభినందనలు తెలిపారు. మద్నూర్ మండల వాసులు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాగుమరే జ్యోతి, శంకర్ దంపతులకి ఏకైక పుత్రిక అయిన వాగుమరే శ సంచి ఈరోజు జన్మదిన సందర్భంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో  ఏర్పాటు చేసిన రియబిలేషన్ సెంటర్కి వెళ్ళి జన్మదిన సందర్భంగా వరద బాధితులకు అన్నదానం చేయడం జరిగింది.

అక్కడ పరిశీలనలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఆక్కడే ఉండడంతో  వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. వారికి సబ్ కలెక్టర్ గారు మంచి మనసుతో ముందుకొచ్చినందుకు అభినందనలు తెలిపారు. కూతురు జన్మదినాన్ని పురస్కరించుకొని తమకు అన్నదానం చేసిన వరద బాధ్యతులు ఆ కూతురు ఆ దంపతులు భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించి ఇలాంటి సేవలు మరిన్ని అందించాలని ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -