నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని బంగారుపల్లి గ్రామంలో మంగళవారం నుండి ప్రారంభించిన వైద్య శిబిరాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వస్తున్న రోగులతో మాట్లాడారు. గ్రామంలో చికెన్ గున్యా, మలేరియా వంటి సమస్యలతో బాధపడుతున్న రోగుల కొరకు వైద్య శిబిరాన్ని కొన్ని రోజులపాటు గ్రామంలో కొనసాగించాలని జుక్కల్ ప్రాథమిక ఆస్సత్రి వైద్యుడు మెడికల్ ఆఫీసర్ విఠల్ ను ఆదేశించారు. గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకొని సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ కు సూచించారు. మండలంలోని గ్రామాలలో వైద్య సిబ్బంది పర్యటించాలని, రోగాలతొ బాధ పడుతున్న వారిని గుర్తించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం దోస్తుపల్లి అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించారు. బంగారుపల్లి వైద్య శిబిరాన్ని సందర్శించిన కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ తో పాటు ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము, జుక్కల్ ప్రాథమిక వైద్య శాల మెడికల్ ఆఫీసర్ విఠల్ , ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
బంగారుపల్లి వైద్య శిబిరాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES