– మాందాపూర్ లో సొంత డబ్బులతో నాలుగు కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం
నవతెలంగాణ – కామారెడ్డి/ బిబిపేట్: కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలోని మందాపూర్ గ్రామంలో గత ఏడాదిన్నర క్రితం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నాలుగు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి, విషయం తెలుసుకున్న తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఆ సమయంలో వారి ఇండ్లకు వెళ్లి కుటుంబాల్ని ఓదార్చి తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు సహాయం అందించి, తన సొంత ఖర్చుతో కొత్త ఇండ్లు నిర్మిస్తా అని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి శనివారం ఆయన చేతుల మీదుగా నూతన గృహాలను ప్రారంభించారు. దోమకొండ మండల పరిధికి చెందిన కమ్మరి లక్ష్మి, కమ్మరి రాజక్క చిన్నతనం లోనే సుమారు 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల ను కోల్పోయినారు. నిరుపేదలైన ఆ ఇద్దరు మహిళలు కనీస నివాసం లేక ఏ దిక్కూ లేకుండా ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నారని ఇట్టి విషయం సుభాష్ రెడ్డి దృష్టికి రాగానే ఆయన స్పందించి కొత్త ఇళ్లు నిర్మిస్తా అని భరోసా ఇచ్చి నూతన గృహాన్ని నిర్మిపాజేశారు. ఈ రోజు సుభాష్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించి మా పేద కుటుంబల్లో సంతోషాన్ని నింపిన దేవుడు సుభాష్ రెడ్డి అని వారితో పాటు గ్రామస్థులు సుభాష్ రెడ్డి కుటుంబం ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నూతన గృహాలను ప్రారంభించిన సుభాష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



