- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల్ శివారులో గల శివాలయం పూర్తిగా నీటమునిగింది. గోలి లింగాల్ గ్రామ సరిహద్దులో నుండి మంజీరా నది పారుతూ ఉంటుంది. నది ఒడ్డున గ్రామస్తులు శివాలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. విపరీతమైన వర్షాల వల్ల సింగూర్ నుండి దిగువకు నీళ్లు వదిలారు. దీంతో నది పూర్తిస్థాయిలో ప్రవహిస్తుంది. విపరీతమైన వరదరావడంతో శివాలయం పూర్తిగా నీట మునిగింది.
- Advertisement -