నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతపూర్ గ్రామంలో ఆ గ్రామ ప్రజల ఐక్యమత్యమే ఏడు రోజుల సప్త కార్యక్రమం విజయవంతంగా ముగింపు జరిగినట్లు ఆ గ్రామ పెద్దలు తెలిపారు. ఈ గ్రామంలో ఏడు రోజులుగా సప్త కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామ ప్రజలు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి నిర్వహించిన కీర్తన ప్రవచనాలతో గ్రామస్తుల్లో మంచి మార్గాన్ని చూపించాయని, ముగింపు రోజు గ్రామస్తులంతా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సప్త కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రాంతం నుండి కీర్తన ప్రవచనాల కోసం ముఖ్యమైన మహారాజులు పాల్గొన్నారు. ముగింపు రోజు ప్రత్యేక పూజలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు మహిళలు యువకులు చిన్నారులు పాల్గొన్నారు.
అంతాపూర్ లో సప్త ముగింపు విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



