Friday, May 23, 2025
Homeసినిమాఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు

ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు

- Advertisement -

కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఓక్టేన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘థగ్‌ లైఫ్‌’. ఈ సినిమా జూన్‌ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ ద్వారా హీరో నితిన్‌ ఫాదర్‌ ఎన్‌ సుధాకర్‌ రెడ్డి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో ‘విక్రమ్‌, అమరన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్‌ లైఫ్‌’ భారీగా రిలీజ్‌ చేయబోతోంది.
ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్‌ నిర్వహించిన మీడియా మీట్‌లో హీరో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ,’ఒక దర్శకుడిగా మణిరత్నం ‘నాయకుడు’ సినిమాతో ఎలా అయితే అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారో, ఈ సినిమాతో కూడా ఆయన ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ఇది కూడా మనసుపెట్టి చేసిన సినిమా. ఇది ఒక ఫెంటాస్టిక్స్‌ టీంతో చేసిన సినిమా. గొప్పగా సెలబ్రేట్‌ చేసుకునే సినిమా. ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. ఈ సినిమా ‘నాయకుడు’ కంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఇది నా ప్రామీస్‌. నేను తెలుగులోనే స్టార్‌గా ఎదిగాను. స్టార్‌గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కతజ్ఞతలు’ అని తెలిపారు.
‘కమల్‌ హాసన్‌తో ‘నాయకుడు’ సినిమా చేశాను. మళ్లీ ఆయనతో ఇన్నేళ్ల తర్వాత సెకండ్‌ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన ‘నాయకుడు’ సినిమా సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన దర్శకుడు ఏమనుకుంటున్నాడో దాన్ని అర్థం చేసుకొని సపోర్ట్‌ చేసే హీరో’ అని డైరెక్టర్‌ మణిరత్నం చెప్పారు.
హీరో శింబు మాట్లాడుతూ,’తెలుగు ఆడియన్స్‌ నాకు చాలా స్పెషల్‌. నా బిగినింగ్‌ కెరీర్‌లో ‘మన్మథ’ సినిమాకి తెలుగు ఆడియన్స్‌ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ మర్చిపోలేను. ‘ఓజి’ సాంగ్‌ కూడా త్వరలో రాబోతుంది. పవన్‌ కళ్యాణ్‌ కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్‌. మణిరత్నం క్రమశిక్షణ, టైమింగ్‌ అద్భుతం. కమల్‌తో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్పీరియన్స్‌. ఓ అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -