గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి..
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో మంగళవారం గ్రంధాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నిరుద్యోగులకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆయన గ్రంథపాలకుడు సంపత్ ను ఆదేశించారు.యువతకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా చూడాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మాణం పూర్తి అయిన గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు.
32 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనం నిర్మాణం త్వరలోనే బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కురుమే శ్రీనివాస్, సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్, జావీద్ ఉద్దీన్, ధనుంజయ్, సాయ గౌడ్, ఆసాని అనిల్, సురేష్, శివ, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES