Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుధాకర్ రెడ్డి మృతి దేశానికి తీరని లోటు 

సుధాకర్ రెడ్డి మృతి దేశానికి తీరని లోటు 

- Advertisement -

సురవరం సుధాకర్ రెడ్డి ఆశలను కొనసాగిద్దాం 
సిపిఐ మహబూబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు వరిపల్లి వెంకన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 

పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసి  ఆయన ఈ లోకాన్ని విడిచిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆశలను ప్రతి ఒక్కరం కొనసాగించాలని వారి పల్లి వెంకన్న అన్నారు. మండల కేంద్రంలోని సిపిఐ మండల కార్యదర్శి బైసా స్వామి ఉపాధ్యక్షుడు చిర్ర సత్యనారాయణ తూటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేదల కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి అన్నారు.

భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి సాయుధ పోరాటంలో చిన్నతనంలోనే పాల్గొన్న వ్యక్తి అని అన్నారు. ఈయన మృతి దేశానికి తీరని లోటు అని తెలిపారు. కమ్యూనిస్టుల ఊపిరి పోసి ఉద్యమాన్ని పూరింతలుగా చేసిన వ్యక్తి ఈరోజు కోల్పోవడం ఎంతో బాధాకరమైన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగులోతు బాలాజీ నాయక్, పెరమాండ్ల గుట్టయ్య గౌడ్, కొత్తపల్లి రవి, ముంజంపల్లి వీరన్న, పెరుమాండ్ల బాబు గౌడ్, పెరుమాండ్ల తిలక్ బాబు, చిర్రా సత్యనారాయణ, తూటి వెంకటరెడ్డి, మాదరి ప్రశాంత్, జిలకర యాలాద్రి దాసరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -