యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ ల పైన అవగాహన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి విడిదిలో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ ను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య శనివారం ప్రారంభించారు.సుమారు 90 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్నారు. వీరికి యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ ల పైన అవగాహనా, ప్రాక్టీస్ చేయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సమ్మర్ క్యాంప్ కు హాజరైన పిల్లలకు అల్పాహారం (స్నాక్స్) అందించారు.ఈ సందర్భంగా కోర్స్ కో ఆర్డినేటర్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమ్మర్ క్యాంపు ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు ఆయన రిబ్బన్ కట్ చేసి సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీ నర్సయ్య, వాలంటీర్లు నరేష్, కే.మనీష, వై.సరస్వతి, పిల్లల తల్లి దండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES