Wednesday, March 18, 2026
E-PAPER
Homeమానవివేసవిలో సంరక్షణ ఇలా…

వేసవిలో సంరక్షణ ఇలా…

- Advertisement -

వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. వేడికి చెమట ఎక్కువ పడుతుంది. దీంతో చుండ్రు సమస్య అధికమవుతుంది. సాధారణంగా మన జుట్టు తలను ఇన్సులేట్‌గా, వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ శీతాకాలంలో మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది, అయితే ఇది హాట్‌ సమ్మర్‌లో సమస్యలకు కారణమవుతుంది. ఎండాకాలం స్కాల్ప్‌లో ఈ ఇన్సులేషన్‌ కారణంగా, జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, చెమట కారణంగానూ జుట్టు జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో కొన్ని టిప్స్‌ ఫాలో అయితే.. జట్టును సంరక్షించుకోవచ్చు.
– బయటకు వెళ్లేప్పుడు, జుట్టును స్కార్ఫ్‌ లేదా క్యాప్‌తో కవర్‌ చేసుకోవాలి.
– కొంతమంది ఎండ వేడి తట్టుకోలేక, రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టులోని తేమ, నూనె తొలగిపోయి జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువసార్లు తలస్నానం చేయాలి.
– జుట్టు కుదుళ్లు బలంగా తయారయ్యేందుకు గోరువెచ్చని నూనెతో మర్దన చేయాలి.
– సాధారణంగా పొడవాటి జుట్టు ఉన్నవారికి వేసవి వేడి వాతావరణంలో జుట్టుపై శ్రద్ధ పెట్టడం పెద్ద సమస్య. కాబట్టి పొడవు జుట్టు ఉన్న వారు జుట్టు రాలకుండా, చిట్లకుండా ఉండేలా పైకి టై చేసుకోవాలి.
– ఈత కొలనుల్లో స్నానాలు చేసినప్పుడు జుట్టు పొడిబారుతుంది. బలహీనంగా, పెళుసుగా మారుతుంది. కాబట్టి అటువంటిచోట స్నానం చేసిన తరువాత మంచి నీళ్లతో మరోసారి తలస్నానం చేయాలి.
– వేడినీటి స్నానం శరీరానికే కాదు, జుట్టుకు కూడా మంచిదే. అయితే వేడినీటి స్నానం తరువాత చివరగా జుట్టును చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే, జుట్టుకు బలం పెరిగి మెరుపుగా తయారవుతుంది.
– వేసవికాలంలో జుట్టుకు నిమ్మరసం వాడినట్లయితే మరింత నిర్జీవంగా మారొచ్చు. కాబట్టి కాఫీ డికాషన్‌ లాంటి కండిషనర్లను వాడటం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -