Saturday, April 18, 2026
E-PAPER
Homeజిల్లాలుఘనంగా సన్‌షైన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

ఘనంగా సన్‌షైన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం, సోమూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సన్‌షైన్ స్కూల్‌లో శనివారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని సూచించారు. అలాగే విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల విజయాలను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అశోక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -