- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా నమోదైన ఎల్వన్ ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై సూపర్ చెక్ కార్యక్రమాన్నీ పంచాయతీ కార్యదర్శులు చేపట్టారు. ఇందిరమ్మ లబ్దిదారుల వివరాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు గ్రామంలో 10 మంది లబ్ధిదారులను సూపర్ చెక్ చేస్తున్నారు. మం డల వ్యాప్తంగా 2,184 ఇళ్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం యాప్లో అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ నెల 30 వరకు ఇళ్ల లబ్ధిదారుల స్థితిగతులను,ఇంటి పరిస్థితి, ల్యాండ్ వివరాలను జీపీల వారీగా కార్యదర్శులు యాప్ లో నమోదు చేస్తున్నారు. మొత్తం లబ్ధిదారుల జాబితాలో 5 శాతం జాబితాను ఎంపీడీఓ సూపర్ చెక్ చేస్తున్నారు.
- Advertisement -



