Sunday, October 19, 2025
E-PAPER
Homeసినిమా'డ్యూడ్‌'కి సూపర్‌ రెస్పాన్స్‌

‘డ్యూడ్‌’కి సూపర్‌ రెస్పాన్స్‌

- Advertisement -

హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకొని, హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ‘డ్యూడ్‌’ దివాళి బ్లాస్ట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ,’మా సినిమాని ఇంత అద్భుతంగా రిసీవ్‌ చేసుకున్న ఆడియన్స్‌కి కతజ్ఞతలు. ‘డ్రాగన్‌’ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్‌ చేసిందని మా నిర్మాతలు చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.

దీనికి కారణం మా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌. తెలుగులో అద్భుతంగా రిలీజ్‌ చేశారు. తమిళనాడులో కూడా నా గత సినిమాలు కంటే ఎక్కువ రెస్పాన్స్‌ కలెక్షన్స్‌ ఈ సినిమాకి వస్తున్నాయి’ అని అన్నారు. ‘సినిమా విజయం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మంచి దివాళి గిఫ్ట్‌ ఇచ్చినందుకు హీరో ప్రదీప్‌కి, డైరెక్టర్‌ కీర్తి, టీం అందరికీ థ్యాంక్స్‌. ప్రదీప్‌ గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగు ఐదు రెట్లు ఎక్కువ చేస్తోంది. ఫస్ట్‌ డే వరల్డ్‌ వైడ్‌గా 22 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. అన్ని చోట్ల నుంచి అద్భుతమైన నెంబర్స్‌ వస్తున్నాయి. ఇది దివాళి బిగ్‌ విన్నర్‌. కీర్తి అద్భుతమైన కథ రాసుకొని అద్భుతంగా చేశాడు. ప్రదీప్‌ గారు నెక్స్ట్‌ లెవెల్‌ కి తీసుకెళ్లారు’ అని నిర్మాతలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -