Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమా'రాజా సాబ్‌' ట్రైలర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

‘రాజా సాబ్‌’ ట్రైలర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

- Advertisement -

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘రాజా సాబ్‌’. రీసెంట్‌గా రిలీజై ట్రైలర్‌ బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంటోంది. ‘ఇప్పటికే ఈ సినిమా మీద హై రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండగా..ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. ట్రైలర్‌లో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో ప్రభాస్‌ కనిపించిన తీరు రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసింది. టెర్రిఫిక్‌ రాజా సాబ్‌ క్యారెక్టర్‌తో పాటు వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ వెర్సటైల్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ ట్రైలర్‌లో కనిపించిన వరల్డ్‌ క్లాస్‌ మేకింగ్‌ క్వాలిటీ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ స్టాండర్డ్స్‌ను చూపించింది. ప్రభాస్‌తో వన్స్‌ ఇన్‌ ఎ లైఫ్‌ టైమ్‌ అనిపించే సినిమాను దర్శకుడు మారుతి రూపొందించినట్లు ఈ ట్రైలర్‌ ప్రూవ్‌ చేసింది. తనకు ఇష్టమైన రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీ జోనర్‌లో తన ఫేవరేట్‌ హీరో ప్రభాస్‌ను మారుతి వెర్సటైల్‌గా చూపించారు. తమన్‌ బీజీఎంలోని వేరియేషన్స్‌ ట్రైలర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ముగ్గురు హీరోయిన్స్‌ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ ఈ సినిమాకు కావాల్సినంత గ్లామర్‌ను యాడ్‌ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న థియేటర్స్‌లోకి రానుంది’ అని చిత్ర బృందం తెలిపింది.

యూరప్‌లో 2 పాటలు
సంజరుదత్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ వారం నుంచి యూరప్‌లో కొత్త షెడ్యూల్‌ను మేకర్స్‌ ప్రారంభించ నున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా నాయకానాయికలపై రెండు పాటలను చిత్రీకరించనున్నారు. దీంతో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. ఇక మరోవైపు నిర్మాణాంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్‌ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. అలాగే ఇందులో సంజరు దత్‌ పాత్రతోపాటు 3 నాయికల పాత్రలు సైతం ప్రేక్షకులు ఊహించని రీతిలో ఉంటాయి. భారీ హంగులతో రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -