సీపీఐ(ఎం)ను కోరిన ఓయూ బీసీ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ రిజర్వేషన్ల కోసం మద్దతివ్వాలని సీపీఐ(ఎం)ను ఓయూ బీసీ జేఏసీ కోరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధానకోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఓయూ బీసీ జేఏసీ బృందం హైదరాబాద్‌లో ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వేస్లీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీ కులాలకు రిజర్వేషన్లు లేకపోవటంతో చట్ట సభలలోకి వెళ్లే అవకాశం కోల్పోతున్నామని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వెనుక బడిన కులాల జనాభా ఉండి రాజకీయ ప్రాతినిద్యం లేక చరిత్రలో కనుమరుగయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వర్గాల అభ్యున్నతి కోసం జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే బాధ్యత అధికారంలో ఉన్న పాలకులపై ఉందనీ, 42శాతం బీసీ కులాల రిజర్వేషన్ల బిల్లును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో ఒత్తిడి తేవాలని కోరారు. ఓయూలో జరుగుతున్న బీసీ ఉద్యమాలకు, భవిష్యత్ కార్యాచరణకు మద్దతుంటుందని జాన్‌వెస్లీ ఈ సందర్భంగా తెలిపారు. వెస్లీని కలిసిన వారిలో డాక్టర్ :నిజ్జన రమేష్ ముదిరాజ్, దేశగాని సాంబశివ గౌడ్, అర్ ఎల్ మూర్తి , అర్ ఎన్ శంకర్ అల్లుడు జగన్ ముదిరాజ్ , మాసం పల్లి అరుణ్ కుమార్ , నక్క శ్రీశైలం యాదవ్, బైరు నాగరాజు, సయ్యద్ సలీం పాషా గౌడ్, కోట రమేష్, అనగంటి వెంకటేష్ తదితరులు ఉన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం మద్దతివ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



