Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపంజాబ్‌, హర్యానాను ఆదుకోండి

పంజాబ్‌, హర్యానాను ఆదుకోండి

- Advertisement -
  • వరద నష్టంపై కేంద్రానికి ఏఐకేఎస్‌ డిమాండ్‌
  • భారీగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ : ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రా ల్లోనూ వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లోని పంటలు నాశనమయ్యాయని తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ఆనకట్టల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని దీంతో బియాస్‌, సట్లెజ్‌ నదులు పొంగి పొర్లుతున్నాయని, ఫలితంగా వచ్చిన వరదలు చేతికి వచ్చిన పంటలకు విస్తృత నష్టాన్ని కలిగించాయని ఏఐకేఎస్‌ తెలిపింది. భారీ వర్షాలకు నాలుగురాష్ట్రాల్లోనూ 320 మందికిపైగా మరణించారని, వందలాది పశువులు మృతి చెందాయని తెలిపింది. ముఖ్యంగా పంజాబ్‌ అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నదని, రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లోనూ వరదలు వచ్చాయని తెలిపింది. వివిధ నివేదికల ప్రకారం పంజాబ్‌లోని 1,400 గ్రామాల్లోని సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా లేదా పాక్షికంగా మునిగి పోయాయని, 3.5 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారని ఏఐకేఎస్‌ తెలిపింది. అలాగే, హర్యానాలోని 12 జిల్లాల్లో దాదాపు 2.5 లక్షల ఎకరాల పంట నాశమైనట్టు ఈ ప్రకటనలో ఏఐకేఎస్‌ తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ల్లో కొండచరియలు విరిగపడ్డం, ఆకస్మిక వరదలతో ప్రాణనష్టం సంభవించిందని, ఆపిల్‌ తోటలు నాశనమయ్యా యని తెలిపింది. దాదాపు 25 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయాయని తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం బృందాలను ఏర్పాటు చేసిందని, అయితే ఈ సమయంలో ఈ రాష్ట్రాలకు కేంద్రం సమగ్ర సహాయ ప్యాకేజీని విడుదల చేయడం చాలా ముఖ్యమని ఏఐకేఎస్‌ స్పష్టం చేసింది. పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది.
అలాగే, ఈ నాలుగు రాష్ట్రాల్లో జీవితాన్ని, జీవనోపాధిని పునర్మిర్మించుకుం టున్న ప్రజలకు ఏఐకేఎస్‌ పూర్తి సంఘీ భావాన్ని ప్రకటించింది. అలాగే ఏఐకేఎస్‌ సహాయనిధికి విరాళాలు అందించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విరాళాల ద్వారా సేకరించిన ధనాన్ని ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, కార్మికులకు అవసరమైన సహాయ సామాగ్రిని కొనుగోలు చేయడానికి, పంపిణీ చేయడానికి ఉపయోగిస్తామని తెలిపింది. ప్రకృతి విపత్తుతో పోరాడు తున్న శ్రామిక ప్రజలకు సహాయం చేయడానికి పెద్దఎత్తున కదలిరావాలని ఏఐకేఎస్‌ పిలుపునిచ్చింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad