Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంఅసోం సీఎం విద్వేష వీడియోపై 16న సుప్రీం విచారణ

అసోం సీఎం విద్వేష వీడియోపై 16న సుప్రీం విచారణ

- Advertisement -

హిమంతపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు, సిట్‌ ఏర్పాటుకు సీపీఐ(ఎం), సీపీఐ విజ్ఞప్తి

న్యూఢిల్లీ : ఒక మతానికి చెందిన వారిపై విద్వేషాన్ని చిమ్మేలా… తుపాకీతో గురిపెట్టి కాలుస్తున్నట్టుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై వచ్చిన వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఆ వీడియోకు సంబంధించి శర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం), సీపీఐ నేతల తరఫున లాయర్‌ నిజామ్‌ పాషా వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం దానిపై విచారణ జరిపేందుకు ఈ నెల 10న అంగీకరించింది. ఈ నెల 7న అసోం బీజేపీ అఫీషియల్‌ ఎక్స్‌ హ్యాండిల్‌ ఈ వీడియోను షేర్‌ చేసింది.

ఈ వీడియోకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేనందున స్వతంత్ర ప్రాతపదికన పనిచేసే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ కోరాయి. హిమంత బిశ్వ శర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై తీవ్రమైన ఆగ్రహావేశాలు, రాజకీయ పార్టీల ఖండనలు వెలువడడంతో బీజేపీ దీన్ని తొలగించింది. విద్వేష వీడియోను నిరసిస్తూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) తరఫున, సీపీఐ నేత అనీ రాజా తరపున వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులు మత ప్రాతిపదికన విభజన చేసేందుకు చేస్తున్న వ్యాఖ్యలను నిరోధించడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే 12 మంది ప్రముఖులు సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -