Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeసినిమాబర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సంచలన విజయం తరువాత పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ శంకర్‌ కలయికలో వస్తున్న చిత్రమిది.
నేడు (మంగళవారం) పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి ఓ ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. బ్లాక్‌ త్రీ పీస్‌ సూట్‌, టోపీతో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
తన సినిమాలలో హీరోలను అద్భుతంగా చూపించడంలో పేరొందిన దర్శకుడు హరీష్‌ శంకర్‌.
ఈ సినిమాలోనూ పవన్‌ కళ్యాణ్‌ కోసం తనలోని అభిమానిని బయటకు తీసుకువచ్చి, సినిమాలోని ఓ పాట స్టిల్‌తో అభిమానులందరికీ మరిచిపోలేని బర్త్‌డే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఈనెల 6న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు మాస్‌ ప్రేక్షకులు, యాక్షన్‌ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి హామీ ఇచ్చారు.
పవన్‌ కళ్యాణ్‌, శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పార్థిబన్‌, కె.ఎస్‌.రవికుమార్‌, ఎల్‌ బి శ్రీరామ్‌, రాంకీ, ప్రభాస్‌ శ్రీను, సత్యం రాజేష్‌, జయ ప్రకాష్‌, వర్గీస్‌, మీర్‌ సర్వర్‌, ప్రవీణ్‌, టెంపర్‌ వంశీ, నవాబ్‌ షా, శ్రీరామ్‌, మాగంటి శ్రీనాథ్‌, కిల్లి క్రాంతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad