– జడ్చర్ల ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
నవతెలంగాణ- జడ్చర్ల
జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు తిన్న ఘటనపై నలుగురు అధికారులను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, ఎంఎనీ రవిప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణలో సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆరు నెలల కిందటే పోస్టుమార్టం గదిని పూర్తి చేసి కాంట్రాక్టర్ ఆస్పత్రికి అప్పగించారని తెలిపారు. అయినా అక్కడ పోస్టుమార్టం కార్యకలాపాలు నిర్వహించకపోవడంతోపాటు కొత్తగా వచ్చిన ఫ్రీజర్లను ప్రారంభించకపోవడంతోనే నేడు ఈ ఘటన జరిగినట్టు వివరించారు. ఆస్పత్రిలో వైద్యుల పనితీరు కూడా సరిగా లేదన్నారు. ఈ ఘటనపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.
నలుగురు వైద్యాధికారుల సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



