- Advertisement -
నవతెలంగాణ-మోపాల్
శనివారం రాత్రి సమయంలో వెల్దుర్తిలో విషాదం చోటుచేసుకుంది. మోపాల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధర్ (53) ప్రయివేట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా నర్సింగ్ పల్లి గ్రామంలో తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. కంజర గ్రామం దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల సమీపాన చెట్ల పొదలో పడి చనిపోయినాడు. మృతుడిని వాచ్మెన్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బండి నెంబర్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయిందని ఎస్ఎస్ సుష్మా తెలియజేయడం జరిగింది.
- Advertisement -