Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎస్ పి ఆర్ పాఠశాలలో స్వదేశీ జాగరణ మంచ్

ఎస్ పి ఆర్ పాఠశాలలో స్వదేశీ జాగరణ మంచ్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : స్వదేశీ జాగరణ మంచ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ పి ఆర్ పాఠశాలలో “స్వదేశీ విధానాలు, స్వావలంభి భారత్ అభియాన్ లో విద్యార్థుల పాత్రపై” అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య క్షేత్ర సంఘటక్ జగదీష్ జీ విచ్చేసి విద్యార్థులనుదేశించి మాట్లాడుతూ  ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు విదేశీ వస్తువులు వాడుతూ స్వదేశీ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నామని తెలిపారు. చైనా, టర్కీ, అమెరికా వస్తువులు వాడొద్దని పిలుపునిచ్చారు. ప్రపంచంలో భారత్ 3 వ ఆర్థిక దేశంగా ఎదగడానికి మనం వాడే వస్తువుల నుండి మొదలుకొని స్వదేశీ ఆర్థిక విధానాలు పాటించడమే శ్రేయస్కరమన్నారు.

పరిశ్రమల్లో స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ ఉత్పత్తులు మరింతగా బయటకు రావాలని వివరించారు. పెద్ద పెద్ద మాల్స్ లో వస్తువులు కొనుగోలు చేయకుండా ఊర్లల్లో ఉండే దుకాణాల్లో వస్తువులు కొంటే స్వయం ఉపాధి పొందే వ్యక్తులను ప్రోత్సహించినట్లు అవుతాయని గుర్తు చేశారు. ఆన్లైన్ మార్కెటింగ్ లో పాతుకుపోయిన ఫ్లిఫ్కార్ట్, అమెజాన్, స్విగ్గి, జోమాటో విదేశీ కంపెనీలకు వంత పాడకుండా దగ్గరలోని దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మారుతి, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత యువ ప్రముఖ్ డా.రాహుల్ కుమార్, రిటైర్డ్ లెక్చరర్ రణజీత్ మోహన్, జిల్లా సంఘర్షణ ప్రముఖ్ డా.సంతోష్ గౌడ్, స్వదేశీ కార్యకర్తలు ఆంజనేయులు, సాహిత్,మనీష్ , విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad