సీనియర్ నేత మృతి
డమాస్కస్ : ఇస్లామిక్ స్టేట్ సీనియర్ నాయకుడు మహ్మద్ షాహదాను హతమార్చినట్టు సిరియా అధికారులు గురువారం తెలిపారు. డమాస్కస్‌కు సమీపంలో మరో ఐఎస్ నేతను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే ఈ హత్య జరిగింది. అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంకీర్ణ బలగాలతో కలిసి పనిచేస్తున్న సిరియా సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ బలగాలు కచ్చితమైన లక్ష్యంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మరో ఐఎస్ నేత ఒమర్ తబియాను ఆయన అనుచరులు పలువురిని అరెస్టు చేశామని చెప్పారు. డిసెంబరు 13న జరిగిన దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, అమెరికా పౌరుడు ఒకరు మరణించారు. ఈ దాడికి సిరియాలోని పల్మీరాలో గల ఐఎస్ గన్‌మేన్ కారణమని అమెరికా ఆరోపించింది. ఇందుకు ప్రతిగా అమెరికా బలగాలు సిరియాలోని ఐఎస్ లక్ష్యాలపై దాడులు జరిపాయి. ఆ దాడుల్లో జిహాదిస్ట్ గ్రూపునకు చెందిన ఐదుగురు మరణించారు. సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షారా నవంబరులో వాషింగ్టన్‌లో పర్యటించినపుడు ఐఎస్‌కు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో సిరియా అధికారికంగా చేరింది.
ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలపై సిరియా దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



