అవార్డు అందజేసిన కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల, కాపురం బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన టిఎస్ జెన్కో కంపెనీ 2023-2024 సంవత్సరానికి 5-స్టార్ రేటింగ్ అవార్డును గెలుచుకుందని ఏఎమ్మార్ మైన్ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా స్టార్ రేటింగ్ అవార్డు వేడుక సందర్భంగా దేశంలోని ముంబయిలో 2023-2024 సంవత్సరానికి బొగ్గు గనుల వార్షిక రేటింగ్లో 5-స్టార్ రేటింగ్ ను పొందిందన్నారు. బొగ్గు తవ్వకంలో దాని ఆదర్శప్రాయమైన పనితీరు,అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండటంతో ఓపెస్కాస్ట్ గనుల విభాగంలో 5-స్టార్ అచీవర్స్ బహుమతిని పొందింనట్లుగా తెలిపారు. ఈ స్టార్ రేటింగ్ అవార్డు వేడుకను భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ శుక్రవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించించగా.. ఈ అవార్డును కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి,బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూటే ప్రదానం చేశారు. ఈ అవార్డును జెన్కో తరపున బి.నాగ్య డైరెక్టర్ (బొగ్గు, లాజిస్టిక్స్), సి.జీవ కుమార్,చీఫ్ ఇంజనీర్ (బొగ్గు,వాణిజ్య), పి. మోహన్ రావు,జనరల్ మేనేజర్ (గనులు) సగర్వంగా అందుకున్నారు.
5-స్టార్ అవార్డు గెలుచుకున్న తాడిచెర్ల ఓసీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES