నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తాసిల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఐకెపి కార్యాలయం కోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉండడంతో ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకు రావడానికి అద్దె భవనంలో ఉన్న తాసిల్దార్ కార్యాలయాన్ని వెంటనే ఈ భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ అధికారులను బుధవారం ఆదేశించారు. తాసిల్దార్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా మండల పరిషత్ కార్యాలయం తో పాటు తాసిల్దార్ కార్యాలయం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. వెంటనే తాసిల్దార్ కార్యాలయాన్ని ఈ భవనంలోకి మార్చాలని సూచించారు. ప్రత్యేక నిధులతో అధికారుల మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
తహశీల్దార్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES