నవతెలంగాణ - హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం 34 శాతం బోనస్ ప్రకటించింది. గతేడాది మాదిరిగానే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ.1,53,912 అందనుంది. ఒప్పంద కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థకు రూ.1,754 కోట్ల లాభాలు వచ్చినట్లు పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)