నవతెలంగాణ-హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి భారీ విజయం దక్కింది. మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి మరగతం కుమరవేల్ 17,554 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 61,470 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి పరంధామన్‌కు 43,916 ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే అభ్యర్థి గణిత సంపత్ 38,770 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 27 మంది పోటీ చేయగా, 86.26 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి హాసీ రాణి రాత్ తన సమీప ప్రత్యర్థిపై 1.2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.






కామెంట్‌లు (0)