Magazines

రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

1 గంట క్రితం

DCM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా నవలకుంద పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అమరగోల్ గ్రామం సమీపంలో కారు-కాంటర్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ధార్వాడ్-హుబ్బళ్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను అజిత్, రాకేష్, సందీప్, శృతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న నవలకుంద పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్